ETV Bharat / state

ఉన్నతాధికారుల బదిలీలు..సీఎంగా తొలి రోజే జగన్ 'ముద్ర'

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం భారీ స్థాయిలో అధికారుల బదిలీలు చేపట్టింది. సీఎం కార్యాలయం సహా, రాష్ట్ర డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ ను బదిలీ చేసింది. కొత్త డీజీపీగా గౌతం సవాంగ్ ను నియమించింది.  ఏసీబీ డైరెక్టర్ గా విశ్వజిత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : May 31, 2019, 6:01 AM IST

Updated : May 31, 2019, 10:02 AM IST

ఉన్నతాధికారుల బదిలీలు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్.. కొద్ది గంటల్లోనే అధికారుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన జట్టును రూపొందించుకోవడంపై దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో ...కొత్త వారిని నియమించిన ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులతోపాటు రాష్ట్ర డీజీపీ, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ను బదిలీ చేస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. బదిలీ అయినా అధికారులు సాధారణ పరిపాలను శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
సీఎం కార్యాలయంలో బదిలీలు..
ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల బదిలీలు మొదలయ్యాయి . ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ‍్యతలు స్వీకరించిన అనంతరం సీఎంవో అధికారులపై బదిలీ వేటు పడింది. గత సీఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్‌చంద్ర, ముఖ్య కార‍్యదర్శి సాయిప్రసాద్‌, సీఎం కార్యదర్శులు గిరిజా శంకర్‌, రాజమౌళిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదనపు కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
సీఎం ఓఎస్డీగా పి. కృష్ణామోహన్ రెడ్డి....
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీగా కృష్ణమోహన్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జోవో జారీ చేసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎస్. ఎస్ రావత్, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 30 నుంచి ఆదేశాలు వర్తిస్తాయని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
డీజీపీగా సవాంగ్...
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సీనియర్ అధికారి గౌతం సవాంగ్ ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్ ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా​ బదిలీ చేసింది.
ఏసీబీ డైరెక్టర్ బదిలీ..
అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ఏసీబీ డైరెక్టర్ గా కుమార్ విశ్వజిత్​ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Mumbai, May 30 (ANI): Power Finance Corporation (PFC), a central public sector enterprise, which lends funds to the power sector, has reported a standalone profit of Rs 6,953 crore for the financial year 2019, company's Chairman and Managing Director Rajeev Sharma told media in Mumbai. In 2019, PFC has made a 58% growth in its profits on a year over year basis. The quarter wise growth, of Q4, is 166% in comparison to the corresponding quarter of the last year.
Last Updated : May 31, 2019, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.