ETV Bharat / state

'నిబంధనలకు విరుద్ధమైన ఆ నియామకం చెల్లదు'

గుంటూరు అయిదో అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా శివలీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిబంధనలకు అనుగుణంగా నియామక ప్రక్రియ జరగలేదని స్పష్టం చేసింది.

author img

By

Published : Jun 29, 2019, 6:44 AM IST

హైకోర్టు

పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(పీపీ),అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను(ఏపీపీ) నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అది అపరిమితం కాదని నిబంధనల ప్రకారమే నియమించాలని హైకోర్టు సూచించింది . గుంటూరు అయిదో అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా శివలీల నియామకం నేరవిచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ 24(4) నిబంధనల ప్రకారం జరగలేదని స్పష్టం చేసింది. శివలీల నియామకాన్ని రద్దు చేసింది. ఏపీపీ నియామక నిమిత్తం నిబంధనలు అనుసరించి న్యాయవాదుల పేర్లతో కూడిన జాబితాను తాజా ప్యానల్ ప్రభుత్వానికి పంపే అంశాన్ని అధికారులకు వదిలేసింది.

శివలీల నియామకం నిబంధలను అనుసరించి జరగలేదని గుంటూరుకు చెందిన శివాజీ మరో ఇద్దరు న్యాయవాదులు కలిసి పిల్ వేశారు. పిటీషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ శివలీల నియామకం రాజకీయ సిఫార్సుతో జరిగిందన్నారు. క్రిమినల్ కేసులు వాదించే అర్హత ఆమెకు లేదని తెలిపారు. ఏపీపీకి దరఖాస్తులను జిల్లా జడ్జి ఆహ్వానించడం బదులుగా అయిదో అదనపు జిల్లా కోర్టు జడ్జి ఆహ్వానించారన్నారు. దీనిపై హోంమత్రిత్వ శాఖ ప్రమాణపత్రం దాఖలు చేసింది. సర్వీసు విషయంలో కోర్టులో వ్యాజ్యం వేయకూడదని తెలిపారు. శివలీల నియామకం నిబంధనల ప్రకారమే జరిగిందని.. ఎవరి సిఫార్సులు లేవని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం సీఆర్ పిసీ సెక్షన్ 24(4) ప్రకారం నియామకం జరగలేదన్నారు. పేర్ల జాబితాను అధికారులు కలెక్టర్​కు అందిస్తే.. కలెక్టర్ జిల్లా జడ్జిని సంప్రదించి..పేర్ల జాబితాలో ఉన్న న్యాయవాదులు అర్హులో కాదో నిర్ణయానికి వచ్చిన తర్వాత నియామకం జరుగుతుందన్నారు. అయితే కేసులో ఈ తరహాలో నియామకం జరిగినట్లు ఆధారాలు లేవని.. శివలీల నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది.

Intro:ap_vsp_77_29_kadhamtokkina_girijanam_avb_paderu_siva_AP10082 శివ, పాడేరు నోట్: ap_vsp_76_28_. ninna file follow-up... ...... యాంకర్: రాష్ట్ర గిరిజన ప్రాంతంలో అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు అడవి పై హక్కు కల్పించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు కదం తొక్కారు గిరిజన ప్రాంతంలో అటవీ శాఖ చట్టంతో గిరిజనాభివృద్ధి కొంగలు తొక్క పడుతుందని గిరిజన సంఘం ఆవేదన చెందింది పాడేరు ఐ.టి.డి.ఎ ముట్టడించడానికి యత్నించిన గిరిజన సంఘం నాయకులు గిరిజనులను పోలీసులు అడ్డగించారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలంటూ గిరిజన ప్రాంతంలో అటవీ హక్కు చట్టం పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బైట్: గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అప్పలనర్స శివ, పాడేరు

Body:శివ

Conclusion:9493274036

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.