గుంటూరు జిల్లా నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవన ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శాత్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాప కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సీఎం చంద్రబాబు ,సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్వీరమణ ,లావు నాగేశ్వరరావు ,సుభాష్ రెడ్డి ,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ , తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ లు పాల్గొన్నారు.అనంతరం హైకోర్ట్ భవనాన్ని సీజేఐ రంజన్ గోగోయ్ ప్రారంభించారు. కోర్టు ప్రాంగణం ముందు ఏర్పాటుచేసిన భారీ జాతీయజెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా సందర్శకులు తరలివచ్చారు.
8 నెలల్లోనే చరిత్రలో నిలిచిపోయేలా హైకోర్టు భవనాన్ని నిర్మించడాన్ని సందర్శకులు కొనియాడారు.రాజస్థాన్ మార్బుల్స్ తో నిర్మాణం చేపట్టడం వల్ల భవనంలో రాజసం ఉట్టిపడుతుందన్నారు. హైకోర్టులో ఏర్పాటుచేసిన ప్రధాన కోర్టు హాలును విశాలంగా నిర్మించారని న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు .హైకోర్టులో పెండింగ్ లో ఉన్న చిన్న కేసుల్ని వెంటనే పరిష్కరిస్తే కేసుల భారం తగ్గుతుందని న్యాయవాదులు చెపుతున్నారు.