ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరులో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. కృష్ణా జిల్లాలో మరో 3 గంటల్లో ఒకట్రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కనిపిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

author img

By

Published : Jul 20, 2019, 9:13 AM IST

rains
రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని బాపట్ల, నరసరావుపేటలో తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ప్రకాశం జిల్లా పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, మార్టూరులో వర్షం కుండపోతగా కురుస్తోంది. యద్దనపూడి మండలం యనమదలలో ఉప్పువాగు ఉద్ధృతికి ఎస్సీ కాలనీకి ముప్పు పొంచి ఉంది. సమీపంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చినగంజాం నీట మునిగింది. ఇళ్లన్నీ వర్షపునీటిలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మరో 3 గంటల్లో ఒకట్రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కనిపిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిత్తూరు జిల్లా గూడుపల్లి మం. బొయ్యనపల్లిలో పిడుగుపాటుకు గర్భిణి మృతి చెందింది.

Intro:FILE NAME : AP_ONG_41_20_CHIRALA_VARSHAM_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA( PRAKASAM)

యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా వ్యాపంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి... చీరాల,వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు మార్టూరు ప్రాంతాల్లో తెల్లవారుజామునుండి వర్షం కురుస్తుంది... చీరాల పట్టణంలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది.. కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.. .

Body:చీరాల లో కురుస్తున్న వర్షం..

Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్: 748, ఎంప్లాయ్ ఐడి: AP10068, ఫోన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.