రాష్ట్రంలో తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న 15 రోజుల్లో కొత్త ఇసుక విధానం తీసుకొస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గతేడాది మైనింగ్ ద్వారా 2 వేల 643 కోట్ల ఆదాయం సమకూరగా...ఇసుక ద్వారా కేవలం 116 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. 202 ఇసుక రీచ్లు కాస్తా..116 కు తగ్గాయన్నారు. చెన్నై, కర్ణాటకలకు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందన్నారు. మెుదటి రెండేళ్లలో కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో తెదేపా నేతలు ఇసుకపై వేల కోట్లు ఆర్జించారన్నారు. ఇసుకు దోపిడీ కారణంగానే వారు ఓడిపోయారని అన్నారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి