ETV Bharat / state

బుచ్చయ్య గారూ షర్ట్​ బాగుంది...అవునూ నేను ఆల్​వేస్​ స్మార్ట్​! - చంద్రబాబు

అసెంబ్లీలో సీట్ల సర్దుబాటుపై...ప్రతిపక్షాల మధ్య మాటల దాడి పెరిగింది. అచ్చెన్నాయుడు స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూర్చోవడాన్ని అధికార పక్ష సభ్యులు తప్పు పట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నారు.

funny_conversation_between_mla's_in_ap_assembly
author img

By

Published : Jul 17, 2019, 1:21 PM IST

Updated : Jul 17, 2019, 5:23 PM IST

శాసనసభలో సీట్ల సర్దుబాటుపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సంవాదం జరిగింది. అచ్చెన్నాయుడు స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూర్చోవడాన్ని... అధికార పక్ష సభ్యులు తప్పుపట్టారు. తనకు కేటాయించిన స్థానంలో కూర్చొనేలా ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. ఈ సమయంలో సభ్యుల మధ్య వ్యంగ్యోక్తులు చోటు చేసుకున్నాయి. ''బుచ్చయ్య చౌదరి గారి షర్ట్ బాగుందని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు... దీనికి స్పందిస్తూ.. అవునూ నేను ఆల్​వేస్​ స్మార్ట్​'' అంటూ బుచ్చయ్య చౌదరి బదులిచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభాసంప్రదాయాల ప్రకారం సీట్ల కేటాయింపు చేయాలని స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్షనేత విజ్ఞప్తిని పరిశీలిస్తానని స్పీకర్‌ చెప్పడంతో వివాదం ముగిసింది.

బుచ్చయ్య గారూ షర్ట్​ బాగుంది...అవునూ నేను ఆల్​వేస్​ స్మార్ట్​!

Last Updated : Jul 17, 2019, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.