ETV Bharat / state

నాకు నువ్వు.. నీకు నేను.. ఒకరికొకరం నువ్వూనేను! - kadapa

ఎన్నికలంటే కత్తులు దూసుకోవడం... మాటల తూటాలు పేల్చుకోవడమే తెలుసు. ఈ ఎన్నికలు మాత్రం పాత పగలను పక్కనపెట్టాయి. కంటపడితే... చిటపటలాడే నేతలు.. ప్రచారంలో కలిసి తిరుగుతున్నారు. ఒకరి గెలుపు కోసం మరోకరు పని చేస్తున్నారు. దశాబ్దాల నాటి కక్షలు వదిలి భవిష్యత్ రాజకీయం కోసం ముందుకెళ్తున్నారు.

నాకు నువ్వు! నీకు నేను! ఒకరికొకరం నువ్వు నేను!
author img

By

Published : Apr 3, 2019, 7:02 AM IST

అప్పుడు వైరం...ఇప్పుడు స్నేహం
ఫ్యాక్షన్ గొడవల కారణంగా దశాబ్దాలుగా రక్తపుటేరులు పారిన అనంతలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఊహించామా? కర్నూలు రాజకీయ పోరులో ఎప్పుడూ కత్తులు దూసుకునేవర్గాలుహఠాత్తుగా కలిసిపోతాయని అనుకున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే.. కృష్ణాజిల్లాలోని రెండు కుటుంబాలు స్నేహగీతం పాడుతాయనుకున్నారా? కడప గడ్డపై చరిత్ర చూడని కలయిక సాధ్యమనుకున్నారా? 2019 ఎన్నికల్లో ఇవన్నీ సాధ్యమయ్యాయి. దశాబ్దాల ప్రతీకారాలకు తెరపడింది.

ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు అనంతపురం జిల్లా. ఇక్కడ రెండు బలమైన వర్గాలైన... పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలను రాజకీయంగా ఏకం చేయడంలో తెదేపా అధినాయకత్వం మంత్రాంగం పని చేసింది. నిప్పు, ఉప్పులా ఉండే జేసీ, పరిటాల వర్గీయులు ఇప్పుడు ఒకే పార్టీలో ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇదే కొనసాగాలని ఇప్పుడు రెండు వర్గాలూ కోరుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాలో కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య వైరాన్ని తగ్గించడంలో తెదేపా విజయం సాధించింది. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న గొట్టిపాటి రవికుమార్​ను, కరణం బలరాంను వ్యక్తిగతంగా పిలిచి చర్చించి రాజీ కుదిర్చారు.

కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల మధ్య తరాలుగా ఉన్న అంతరం అందరికీ తెలిసిందే. పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఆ ఇరు కుటుంబాల వారు ఎప్పుడూ కలహించుకుంటూనే ఉంటారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కోట్ల, కేఈ కుటుంబాలు కలిసి ప్రచారం చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో రామ సుబ్బారెడ్డి – ఆది నారాయణ రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి – వీరశివారెడ్డి వర్గాల మధ్య నవరాజకీయంతో రాజీ కుదిరింది.

కృష్ణా జిల్లాలోని దేవినేని, వంగవీటి కుటుంబాల వైరం ఏళ్ల నాటిది. వారు కలుస్తారనే ఆలోచనే ఎవరికి రాదు. ఇప్పుడు వారు కలిసి పనిచేస్తున్నారు. వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ తెలుగుదేశంలోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్గ పోరులో తీవ్రంగా నష్టపోయిన ఇరు కుటుంబాలు ఒకే పార్టీలోకి చేరి భవిష్యత్​ రాజకీయాలకు పునాదులు వేసుకుంటున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.