ETV Bharat / state

బడ్జెట్​లో విద్యాశాఖకు పెద్దపీట: మంత్రి సురేశ్ - AADIMULAPU SURESH

త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్​లో విద్యాశాఖకు అధిక ప్రాధాన్యత ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనతో భేటీ అయి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు.

ఆర్థిక మంత్రి బుగ్గనతో సురేశ్
author img

By

Published : Jul 2, 2019, 12:58 PM IST

Updated : Jul 2, 2019, 1:44 PM IST

బుగ్గనతో భేటీ అనంతరం మీడియాతో మంత్రి

త్వరలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఏపీ పద్దు రూపకల్పనలో నిమగ్నమయ్యారు. మంత్రులు బుగ్గనను కలిసి తమ శాఖకు ఎంత నిధులు అవసరమన్న విషయంపై ప్రతిపాదనలు అందజేస్తున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ సమావేశ మందిరంలో బుగ్గనతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ భేటీ అయ్యారు. ఎన్నికల హామీల మేరకు తమ శాఖకు ఎంత మేరకు నిధులు కేటాయించాలనే విషయంపై ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందజేసినట్లు ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. అమ్మఒడి, మధ్యాహ్న భోజనం, ఖాళీల భర్తీ వంటి వాటికి భారీగా నిధులు కావాలని కోరినట్లు తెలిపారు. దీనికి ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించిందని అన్నారు. మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను నెరవేర్చేందుకు విద్యాశాఖకు ఈ బడ్జెట్​లో విద్యాశాఖకు కచ్చితంగా పెద్ద పీట ఉంటుందని స్పష్టం చేశారు.

Intro:ap_atp_56_02_vidyarthula_darna_av_AP10099
Date:2-07-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID :AP10099
జూనియర్ కళాశాలలో మధ్యాహ్న బోజనం అమలు చేయాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న బోజనం అమలు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెనుకొండ జూనియర్ కళాశాల విద్యార్థుల నిరసన ర్యాలీ . అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు..Body:ap_atp_56_02_vidyarthula_darna_av_AP10099Conclusion:9100020922
Last Updated : Jul 2, 2019, 1:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.