కల్తీ వస్తువులు అమ్మినందుకు... ప్రమాణాలు పాటించనందుకు అధికారులు జరిమానాలు వేయడం చూశాం. కానీ ఇది అందుకు విభిన్నమైన కథ. అందరూ హర్షించే కథ.
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కిరాణా షాపు ఎదుట నాటిన మొక్కలకు నీరు పోయలేదని మున్సిపాలిటీ అధికారులు షాపు యజమానికి జరిమానా వేశారు.
గుంతకల్లు రోడ్డులో 8 నెలల క్రితం నూతనంగా నిర్మించిన షాపుల ముందు మున్సిపల్ అధికారులు చెట్లు నాటారు. కొత్తగా వచ్చిన కమిషనర్ గంగిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. చెట్లకు నీరు పోయకుండా నిర్లక్ష్యం చేసిన.. షాపు యజమాని నంద కుమార్కు ఐదు వేలు జరిమానా వేశారు. చెట్ల పెంపకం రక్షణ కింద జరిమానా వేసినట్లు గంగిరెడ్డి తెలిపారు. చెట్ల పెంపకంపై ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతమైన గుత్తి కోటలోని... చుట్టుపక్కల పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను నాటి అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి.. సీతారాముల తలంబ్రాలకు శ్రీకారం.. కాడి పట్టిన రాంబంట్లు