విభజన హామీలపై రేపు నల్ల బ్యాడ్డీలతో నిరసన తెలపాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ మసిపూసిన మారేడుకాయని విమర్శించారు. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర చేశారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సీఎం టెలికాన్ఫెరెన్స్నిర్వహించారు. కార్గో రాబడి ఒడిశాకిచ్చి...పాసింజర్ రాబడి ఏపీకిచ్చారని దుయ్యబట్టారు. ఏపీకి 7 వేల కోట్ల రాబడి పోగొట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని స్టేషన్లూ విశాఖ జోన్‌కు ఇవ్వలేదన్నారు. సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు జరపాల్నారు.
ఏపీలో అడుగుపెట్టే హక్కు నరేంద్రమోదీకి లేదని మండిపడ్డారు. హామీలన్నీ నెరవేర్చాకే ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. భార్య భాజపా, భర్త వైకాపా రెండు పార్టీల లాలూచీకి రుజువు ఎద్దేవా చేశారు.
పనిచేసే వారికే
పార్టీ కోసం పని చేసేవారికే పదవులని చంద్రబాబు తెలిపారు. చిత్తశుద్ధి, అంకిత భావానికే తెదేపా పెద్దపీట వేస్తుందన్నారు. బీసీలకు 4, కాపులు, రెడ్డి, ఎస్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారు. అభ్యర్థులఎంపికే తెదేపా సామాజిక న్యాయమన్నారు.