ETV Bharat / state

అధికార పార్టీ నేతల సిఫార్సులూ అంగీకరించొద్దు: సీఎం

తన మంత్రివర్గాన్ని విస్తరించకముందే జిల్లాలకు ఎస్పీలను నియమించామని సీఎం జగన్ చెప్పారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్లు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో జగన్ మాట్లాడారు.

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి
author img

By

Published : Jun 25, 2019, 4:54 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

నిబద్ధత, నీతి, నిజాయితీ అనే మూడు అంశాల ప్రాతిపదికన పోలీసు బదిలీలు చేశామని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఏ రాజకీయ పార్టీవైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉన్న అధికారులను ఎస్పీలుగా నియమించామని వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ... పోలీసులకు వారాంతపు సెలవులు ఇవ్వడం లేదని గుర్తు చేశారు. ఒక్కరోజు కుటుంబంతో గడిపితే ప్రజల పట్ల పోలీసుల వ్యవహార శైలి మారుతుందనే వారాంతపు సెలవులు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రజలతో కఠినంగా వ్యవహరించొద్దని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసుల వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు ప్రజలు, బాధితుల నుంచి ఎస్పీలు వివరాలు సేకరించాలని సూచించారు. అవినీతిపరులైతే వారిని పక్కన పెట్టి... వ్యవస్థను మార్చే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. సైబర్​క్రైంను ఎదుర్కోవడంలో పోలీసు విభాగం సమాయత్తం కావాలని జగన్ సూచించారు. మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు నియత్రించలేకపోతే... విధుల్లో విఫలం ఆయినట్లేనని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు చేసే సిఫార్సులనూ అంగీకరించొద్దని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...

ప్రజావేదిక‌ అక్రమమైతే... లోటస్​పాండ్ సక్రమమా?: బుద్దా

Intro:ap_tpg_81_25_samksemapadakalu_ab_c14

Body:అర్హత ఆధారంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే kottaru అబ్బయ్య చౌదరి అన్నారు దెందులూరు మండలం మేదినరావు పాలెం రామారావు గూడెం గ్రామాల్లో లో కబడి పాట ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను అందించిన అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖి గా మాట్లాడారు ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి ఇంటిస్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు అమ్మవారి కార్యక్రమంలో లో తల్లులకు 15 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు వచ్చే అక్టోబర్ నుంచి రైతులకు నగదు ఖాతాలో జమ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.