ETV Bharat / state

ప్రభుత్వ చర్యల్లో రైతుకు భరోసా ఎక్కడ : చంద్రబాబు - mla

పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు, యువత, మహిళలు ఎదురుచూస్తున్నారన్నారని అన్నారు. సమస్యలు వదిలేసి సాధింపులపైనే వైకాపా శ్రద్ధ పెట్టిందని మండిపడ్డారు. అన్నివర్గాల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

tdp chandrababu
author img

By

Published : Jul 17, 2019, 8:59 AM IST

ఇసుక అక్రమ రవాణాలో... వైకాపా నేతలు జుట్లు పట్టుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... ఎంపీ వర్గం, ఎమ్మెల్యేల వర్గం పోటీపడి ఇసుక దోచేస్తున్నారని ఆరోపించారు. పరస్పరం పోలీసు కేసులు పెట్టుకుంటున్నారని... ఇసుక కొరతతో రాజధానిలో పనులు నిలిచిపోయాయని తెలిపారు. పనులు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు.

రైతులకు భరోసా ఎక్కడ...

ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ...రైతుల్లో భరోసా నింపేలా వైకాపా ప్రభుత్వ చర్యలు లేవని చంద్రబాబు అన్నారు. కౌలు రైతులకు రెండేళ్లలో రూ.10 వేలకోట్ల పంట రుణాలు ఇచ్చిన ఘనత తెదేపాదేనన్నారు. అండగా ఉంటామని వైకాపా చెప్పనందుకే కౌలు రైతుల్లో నైరాశ్యం ఏర్పడిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్ కంపెనీలకు నష్టం రాకూడదన్న చంద్రబాబు...ఇతరుల కంపెనీలు నష్టాల్లో మునిగిపోవాలనేదే జగన్‌ దురాలోచన అని ఎద్దేవాచేశారు. కంపెనీలన్నీ మూతపడే దుస్థితి తెస్తున్నారని తెలిపారు. యువత ఉపాధి పోగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్న చంద్రబాబు ...అన్నివర్గాల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు సూచించారు.

Intro:గురు పౌర్ణమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శిరిడి సాయిబాబు ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. తెల్లవారుజాము నుంచే సాయినాథ్ki విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. పలు కూడలిలో ఉన్న ఆలయాల్లో సాయి నామ సంకీర్తన జరిగాయి. అనంతరం అన్న సమాధానం చేశారు.

Body:సాయినాథునికి విశేష పూజలు

Conclusion:గురుపౌర్ణమి వేడుకలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.