సాధారణ వ్యక్తిలా...
ఈ రివ్యూ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులోనే వినాలని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి చీఫ్ జస్టిస్‌ను కోరగా... సీజే అంగీకరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా... సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ తీరును పరిశీలించేందుకు కోర్టులోకి వెళ్లారు. వరుసలో నిల్చొని నిబంధనలను పాటిస్తూ... సాధారణ వ్యక్తిలా కోర్టు హాలులోకి ప్రవేశించారు. 50శాతం వీవీప్యాట్లను లెక్కించే విషయమై ఇవాళ సుప్రీంలో విచారణ సందర్భంగా చంద్రబాబు... సోమవారమే దేశ రాజధానికి చేరుకున్నారు.
ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం...
ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చంద్రబాబు... లోపాలున్నాయని పదేపదే చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు తర్వాత ఈవీఎంలపై చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. దేశవ్యాప్తంగా తిరుగుతూ... ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పిచారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రచారానికి ముంబై వెళ్లిన చంద్రబాబు.. ఈవీఎంల లోపాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని ఎన్నికల సంఘం తీరును ప్రశ్నించారు.
ఈవీఎంల హ్యాకింగ్‌పై గట్టి వాదన...
రష్యా నుంచి వచ్చిన వ్యక్తులు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయని గట్టిగా వాదించారు. ఈ విషయాన్ని తాను నిర్ధారించలేకపోయినా....డబ్బులు ఇస్తే కచ్చితంగా గెలిపిస్తామని వారు చెబుతున్నట్టు తెలిసిందని అన్నారు. ఎన్నో విధాలుగా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చంద్రబాబు తెలిపారు. గోవా, ఉత్తరప్రదేశ్, కేరళ నుంచి కూడా ఈవీఎంలకు సంబంధించిన ఫిర్యాదులు తమకు అందాయని అప్పుడు చెప్పారు.
ఎన్నికల సంఘం తీరుపై అసహనం...
వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు 6 రోజులు పడుతుందని ఎన్నికల సంఘం చెప్పడంపై తాజాగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వీవీప్యాట్‌లో ఓటు సుమారు 7 సెకన్ల పాటు కనిపించాలని... కానీ కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు. లోపాలను సవరించడంలో ఈసీ విఫలమైందని చంద్రబాబు చెప్పారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కూడా ఓటు వేయడానికి ఇబ్బంది పడ్డ విషయం గుర్తుచేశారు.
తాము వేసిన రివ్యూ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని... పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులోనూ పారదర్శకత రావాలనేది తమ ఉద్దేశమని తీర్పు అనంతరం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి...