చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారాన్ని చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. తెదేపా ఇచ్చిన ఫిర్యాదులు పట్టించుకోలేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు లేఖ అందజేశారు. వైకాపా ఇచ్చిన ఫిర్యాదులపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని 12న ఫిర్యాదు చేసినా...ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. వైకాపా ఫిర్యాదు మేరకు 25 రోజుల తర్వాత 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్ణయం ఎలా తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయని...ప్రభుత్వానికి అనుకూలంగా, ఏకపక్షంగా ఈసీ నిర్ణయాలు తీసుకుందని సీఎం చంద్రబాబు విమర్శించారు. రీపోలింగ్ పై అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 24 ఏళ్లుగా తెదేపా అధ్యక్షుడిగా ఉన్నానని..జాతీయ రాజకీయాలు చూశానని..ఇటువంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షపార్టీ ఇష్టారీతిన ఫారం7 పత్రాలు దాఖలు చేసిందని విమర్శించారు. ఫారం7 వచ్చిన ఐపీ అడ్రస్ ఇవ్వాలని కోరినా స్పందించలేదన్నారు.
జాతిపిత గాంధీ పై ప్రజ్ఞాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని...అయినా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇవి చదవండి...300 సీట్లతో మళ్లీ మేమే వస్తాం: మోదీ