ETV Bharat / state

'అక్టోబర్​ 2 నాటికి గ్రామ సెక్రటరీల భర్తీ' - undefined

జులై నుంచి సెప్టెంబర్​లోగా గ్రామ సెక్రటరీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి..అక్టోబర్ 2 నాటికి ఆయా ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు. సచివాలయంలో గ్రామ సెక్రటరీల నియామంకపై  సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపికైన వారికి అందజేయాల్సిన శిక్షణకు తగిన ప్రణాళికలను రూపుదిద్దాలని ఆదేశించారు.

by-october-2-the-village-securities-replacement-process-is-complete-cs
author img

By

Published : Jul 11, 2019, 6:01 AM IST

Updated : Jul 11, 2019, 9:42 AM IST

రాష్ట్ర సచివాలయంలోని గ్రామ సెక్రటరీల నియామకంపై సమన్వయ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా కార్యకలాపాలు నిర్వహించేలా సంబంధిత శాఖలు పకడ్బందీ ప్రణాళికలను అమలు చేయాలని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శుల నియామక ప్రక్రియలను ఆయా శాఖల మార్గదర్శకాలకు, నియమ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని సీఎస్ స్పష్టం చేశారు.

అక్టోబర్ 2 నాటికి ప్రక్రియ పూర్తి..
ఆయా శాఖల ద్వారా సిబ్బందికి అందజేయాల్సిన శిక్షణను అందించేందుకు తగిన ప్రణాళికలను రూపుదిద్దాలన్నారు. నూతనంగా ఎంపిక కాబడుతున్న గ్రామ సెక్రటరీ కార్యాలయ ఉద్యోగులకు తగిన విధంగా విధులను కేటాయించడంతో పాటు వాటి పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఎంపికయ్యే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆయా మండలాల పరిధికి అనుగుణంగా గ్రామాల్లో విధులను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. 2000 మంది జనాభా పరిధిలో గ్రామ సెక్రటరీ 10 శాఖలకు సంబంధించి విధులను నిర్వర్తించడం జరుగుతుందన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 2, 2019 నాటికి ఆయా ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు.

18,037 గ్రామాల పరిధిలో సచివాలయాలు..
ముందుగా 5000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉండాలని ప్రతిపాదించినా... ప్రభుత్వం నూతనంగా చేసిన సూచనల మేరకు ప్రతి 2000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు దిశలో భాగంగా 18,037 గ్రామాల పరిధిలో సచివాలయాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వివరించారు.
గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామ ప్రజలకు అవసరమైన కనీస సేవల నేపథ్యంలో వ్యవసాయం అనుబంధ రంగాలు, పశు సంవర్థక శాఖ, వైద్య ఆరోగ్యం, త్రాగునీరు, పరిశుభ్రత, సామాజిక భద్రత ఫించన్లతో పాటు ఇతర అంశాలకు సంబంధించి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు . జులై నుండి సెప్టెంబర్ లోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి నియామక పత్రాలను అందజేయాలని ప్రతిపాదించామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ నెలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆయా గ్రామాలకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ నెలాఖరుకల్లా నియామక ఉత్తర్వులు అందించాలన్నారు.

Intro:voice: CHAGANTI KOTESWARA RAO
AP_TPG_76_10_CHAGANTI_KOTESWARARAO_RAVI_10003
సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి లోని సుబ్రహ్మణ్య దత్త క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ గతంలో జాతీయ రహదారి వెంబడి వెళ్తూ ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిపారు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతో ఆకర్షించింది అన్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఇక్కడకు వచ్చినట్టు వచ్చినప్పుడు ఈ క్షేత్ర నిర్వాహకులు కలవచర్ల శ్రీనివాస్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పై ప్రవచనం చెప్పాలని తనను కోరారన్నారు సంతాన ప్రాప్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎంతగానో ప్రసిద్ధి నాకు మనవడు జన్మిస్తే తప్పకుండా ఈ దత్త క్షేత్రం
లో ప్రవచనం చెప్తానని బదులిచ్చినట్లు చాగంటి వివరించారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తనకు మనవ డితోపాటు మనవ రాలుని కూడా ప్రసాదించాలని ఆయన సంతోషంతో చెప్పారు త్వరలోనే దత్త క్షేత్రం లో చెబుతానన్నారు

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
Last Updated : Jul 11, 2019, 9:42 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.