వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన రాకేశ్ ఈనెల 14 న పరకాల ఆర్టీసీ డిపో దగ్గరున్న మద్యం షాపులో బీరు కొనుగోలు చేశాడు. బయటకు తీసుకెళ్లి తాగుదామని తెరిచి చూసే సరికి అందులో తేలు ఉండటం చూసి అవాక్కయ్యాడు.
షాపు యజమాని దగ్గరకు తీసుకెళ్లి విషయం చెబితే మొదట ఇక్కడ కొనలేదని వాదించారు. గట్టిగా ప్రశ్నిస్తే ఇక్కడ కొన్నంత మాత్రాన తామేమీ చేయలేమని సమాధానమిచ్చారు. తనకు న్యాయం చేయమంటే ఇది అధికార పార్టీ ఎమ్మెల్యే షాపు అంటూ దౌర్జన్యానికి దిగాడు.
కిక్కుకోసం కొనుక్కున్న బీరు కొంటే చిక్కొచ్చిపడిందంటూ బాధితుడు వాపోయాడు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా మద్యం ప్రియులు గుటక వేసే ముందు ఓ సారి చూసి తాగండి.
ఇదీ చదవండి: అంబేడ్కర్ విగ్రహం చూపుడు వేలు తొలగించారు!