ETV Bharat / state

తుపాను వెళ్లాక.. సమీక్షకు అనుమతిచ్చారు: చంద్రబాబు - ముఖ్యమంత్రి చంద్రబాబు

తుపాను ప్రభావంపై సమీక్ష చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుపాను వెళ్లాక సమీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : May 3, 2019, 5:16 PM IST

Updated : May 3, 2019, 7:36 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలో గతంలో తుపాను ప్రభావం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత తుపాను సమయంలో ముందు జాగ్రత్రలు తీసుకున్నామని తెలిపారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ చర్యలతో రేపు ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా ప్రజలు భరోసాగా ఉంటారని తెలిపారు.
తుపాను ప్రభావంపై సమీక్ష చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుపాను వెళ్లాక సమీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. దిల్లీలో ప్రధాని మోదీ అన్ని సమీక్షలు చేస్తున్నారని, ప్రకృతి విపత్తులపై సమీక్షలు చేసేందుకు అనుమతులపై ఆంక్షలు విధించారని విమర్శించారు. ఇలాంటి సందర్భాల్లో ఈసీ మరింత పరిణతితో ఆలోచించాలన్నారు. కష్టం వచ్చినప్పుడు ఇరుగుపొరుగు రాష్టాలు సహకరించుకోవాలని కోరారు. బాధితులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని చెప్పారు.
తుపాను బాధితులను ఆదుకునేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పుడు తుపాను వస్తే ప్రతిక్షణం సహాయ చర్యలు అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎన్ని తుపాన్లు వచ్చినా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

Intro:కిట్ నం:879, విశాఖ సిటీ,ఎం.డి.అబ్దుల్లా.

నేరస్తుల మనస్తత్వం పరిశీలించేందుకు శాస్త్రీయ విధానాలు అత్యావశ్యక మని బ్రిటిష్ లండన్ రాయల్ కాలేజ్ సంచాలకుడు నిమ్మగడ్డ శేషగిరి రావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగంలో లో 'ఫోరెన్సిక్ సైకాలజీ' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

Body:ప్రధానంగా సైకియాట్రిస్టులు, మనస్తత్వ నిపుణులు నేరస్తులను, వారి మనస్తత్వాలను లోతుగా పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకోసం ఆయా వ్యక్తులతో గంటల తరబడి చర్చించాల్సి ఉంటుందని శేషగిరి రావు సూచించారు.

Conclusion:కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగం సంచాలకుడు ఆచార్య ఎం.వి.ఆర్ రాజు ,సైకాలజీ విభాగ విద్యార్థులు పెద్ద సంఖ్యలో లో పాల్గొన్నారు.

బైట్: డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు, సంచాలకుడు, బ్రిటిష్ లండన్ రాయల్ కాలేజీ.
Last Updated : May 3, 2019, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.