తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఉద్యోగుల ఐఆర్‌పై నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులకు వేతనాలు పెంచింనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగుల వేతనాలపై మాట్లాడటం సంతోషాన్ని కలిగించిందన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పలు శాఖలను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించిందన్న బొప్పరాజు... ఇదే అంశంపై ఆయా శాఖల సంఘాలతోనూ చర్చించాలని విజ్ఞప్తి చేశారు.
2014 నుంచి హెల్త్ కార్డులున్నా... వైద్య సేవలు మాత్రం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఉద్యోగులకు హెల్త్‌కార్డు ద్వారా మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో బదిలీ చేయడమ... అనంతరం వారిని యథావిధిగా వెనక్కి పంపటం ఆనవాయితీగా వస్తుందన్న వెంకటేశ్వర్లు... ఈసారి బదిలీపై వచ్చిన వారిని వెనక్కి పంపటంలో ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. బదిలీలు చేయాలని కోరుతూ... రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండీ...