పుల్వామా దాడిలో నిఘా వర్గాల వైఫల్యంపై ముఖ్యమంత్రిచంద్రబాబు ప్రశ్నిస్తే తప్పేంటని గుంటూరు ఎంపీగల్లా జయదేవ్ ప్రశ్నించారు. దేశం పై జరిగిన దాడిని ప్రశ్నిస్తే దేశ ద్రోహి ఎలాఅవుతారని భాజపా నాయకులపై ధ్వజమెత్తారు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి లేదా అని నిలదీశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు ఇలాంటి ఘటనే జరిగితే... ఆనాటి ప్రధానిమన్మోహన్ ను రాజీనామాకు డిమాండ్ చేయలేదా అని ప్రధానిని ప్రశ్నించారు. దాడి జరిగిన మూడు గంటల వరకూ ప్రధాని ఎందుకు స్పందించలేని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ చెప్పినట్లు మోదీ ప్రైమ్ టైమ్ మినిస్టర్ అని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడినీ రాజకీయ లబ్ధి కోసం భాజపా వాడుకుంటోందని విమర్శించారు.