రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావటంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 14 పనిదినాల్లో రాష్ట్ర బడ్జెట్తో పాటు వివిధ అంశాలను చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
వేశాలు. రేపు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ పద్దు సమర్పించనున్నారు. కరవుపై నేడు శాసనసభలో సీఎం ప్రకటన చేయనున్నారు.అనంతరం దానిపై చర్చ జరగనుంది. బడ్జెట్ అనంతరం 23 అంశాలపై చర్చకు వైకాపా ప్రతిపాదనలు ఇవ్వనుంది. మూడు అంశాలపై చర్చ చేపట్టాలంటూ తెలుగుదేశం ప్రతిపాదనలు చేసింది.