ETV Bharat / state

తెదేపా థండర్స్ vs వైకాపా వారియర్స్ - చంద్రబాబు కెప్టెన్

అక్కడ మాటలు బౌండరీలు దాటుతుంటాయి. సిక్సర్లూ పడుతుంటాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో క్లీన్ బౌల్డ్ చేస్తుంటారు. పోటీ తీవ్రంగా  ఉన్నప్పుడు ప్రత్యర్థి బ్యాచ్​లో వాళ్లను 'క్యాచ్' పట్టేస్తుంటారు. అచ్చంగా క్రికెట్ మాదిరిగానే..! అక్కడ వాళ్లు.. క్రికెట్ పిచ్​పై పోటీపడుతుంటే.. ఇక్కడ వీళ్లు... రాజకీయ క్షేత్రంలో తలపడుతున్నారు. రేపు ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్​తో ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ వచ్చేస్తే.. ఇటు రాష్ట్రంలో ఎన్నికల వేళ పార్టీలు, నాయకుల మధ్య జరుగుతున్న ఆంధ్రప్రదేశ్​ పొలిటికల్ లీగ్​.. వేసవిని మరింత హీటెక్కిస్తోంది.

తెదేపా థండర్స్ vs వైకాపా వారియర్స్
author img

By

Published : Mar 22, 2019, 5:44 PM IST

Updated : Mar 23, 2019, 7:30 AM IST

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభమవుతోంది. రాయల్స్.. కింగ్స్.. రైజర్స్ అంటూ ఒకటే హడావుడి ఉంటుంది. కోహ్లీ, ధోనీ, రోహిత్ వంటి స్టార్ ఆటగాళ్లు మెరుపులు మెరిపిస్తారు. నెల రోజుల పాటు దేశమంతా క్రికెట్ ఫీవరే..! సరిగ్గా అదే రోజుల్లో.. అదే తీరులో.. రాష్ట్రంలోనూ రాజకీయ సందడి నెలకొంటోంది. ఎప్పుడూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకునే ప్రధాన రాజకీయ పక్షాలు తెదేపా - వైకాపా.. మహా పోరుకు సిద్ధమయ్యాయి. ఐదేళ్లపాటు విజేత హోదాను నిలబెట్టుకోవడం కోసం హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి.

డిఫెండింగ్ చాంఫియన్ తెదేపా టైగర్స్ .. సీనియర్ కెప్టెన్ చంద్రబాబు నేతృత్వంలో మరోసారి బరిలోకి దిగింది. అచ్చొచ్చిన పిచ్ పైన అదరగొట్టేయాలని అనుకుంటోంది. ఇంకోవైపు వైకాపా వారియర్స్ తమ కెప్టెన్ జగన్ నేతృత్వంలో ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ టోర్నీలో మాత్రం ఆటగాళ్ల స్థానంలో నేతలుంటారు. బౌండరీలు, సిక్సర్లు బాదినట్టుగాతూటాల్లాంటి మాటలు.. హోరెత్తించే మోతలు ఉంటాయి.

హిట్టర్స్ అండ్ సీమర్స్...

తెదేపా థండర్స్ vs వైకాపా వారియర్స్
తెదేపా థండర్స్ vs వైకాపా వారియర్స్

క్రికెట్​లోరంగంలోకి దిగే ప్రతి జట్టూ..టోర్నీని కైవసం చేసుకోవాలనుకుంటుంది. అందుకు తగ్గట్టే ఓపెనింగ్.. మిడిల్ అర్డర్... హిట్టర్స్​తో పాటు కీలక సమయంలో వికెట్లు పడగొట్టేలా బంతులు వేసే బౌలర్లు కావాలి. కానీ.. ఏపీ పొలిటికల్ టోర్నీలో టార్గెట్ స్పష్టం. ఇక్కడ లక్ష్యం సీఎం కుర్చీని కొట్టడమే..! తెదేపా టీమ్​లో కెప్టెన్ చంద్రబాబే అన్నీ..! అపార అనుభవం ఉన్న ఆయన అనేక క్షిష్టమైన మ్యాచులలో తన జట్టును గెలిపించారు. ఇప్పటికీ లాంగ్ ఇన్నింగ్స్​లు ఆడే స్థిరమైన బాట్స్​మెన్. ఎంతో సంయమనంగా ఉండే కెప్టెన్ అప్పుడప్పుడు దూకుడుగా వెళ్లడానికీ వెనకాడరు. ముందుచూపుతో వ్యూహాలు రచిస్తుంటారు. ప్రత్యర్థుల నుంచి వచ్చే బౌన్సర్లను తట్టుకుంటూ.. జట్టును నడిపిస్తున్నారు. ఆయనటీమ్​లో మంత్రులు దేవినేని, సోమిరెడ్డి వంటి నైపుణ్యం కలిగిన బాట్స్​మెన్ ఉన్నారు. కళా, యనమల వంటి వారు లేఖాస్త్రాలతో మిడిల్ ఆర్డర్లో జట్టు భారాన్ని మోస్తుంటే.. చింతమనేని ప్రభాకర్ లాంటివారు దూకుడు చూపిస్తుంటారు.కెప్టెన్ గైడెన్స్​లో చెలరేగుతూ.. లోకేష్ లాంటి యువనేతలు ట్విటర్ పంచులతో పించ్ హిట్టర్లుగా రాణిస్తున్నారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బుద్దావెంకన్న లాంటి బౌలర్లు ప్రత్యర్థులపై చెలరేగుతుంటారు.

తెదేపా థండర్స్ vs వైకాపా వారియర్స్
తెదేపా థండర్స్ vs వైకాపా వారియర్స్

వైకాపా వారియర్స్​లో.. కెప్టెన్ జగనే ముఖ్యమైన ప్లేయర్. రాజకీయ అనుభవం తక్కువైనా తమ జట్టును అన్నీ తానై నడిపిస్తున్నారు. వైస్​ కెప్టెన్​లాంటివిజయసాయిరెడ్డి.. కెప్టెన్​కు అండగా నిలుస్తుంటారు. అంబటి, చెవిరెడ్డి లాంటి పించ్ హిట్టర్లు.. మాటలతో మెరుపులు మెరిపిస్తుంటారు. బుగ్గన లాంటి బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేయడానికి స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంటారు.

ఆట మొదలైంది

ఏపీ రాజకీయ క్షేత్రంలో ఇప్పటికే ఆట మొదలైపోయింది. మ్యాచ్ మొదలు కాగానే ఒక టీమ్ లో ఉన్న ఆటగాళ్లను ప్రత్యర్థులు క్యాచ్ చేయడం మొదలు పెట్టారు. ఒకరిద్దరు తాము పోటీ చేయబోమంటూ.. వికెట్లను గిరాటేసి "హిట్ వికెట్" అవుతున్నారు. చాలా మందికి ఈ రాజకీయ మైదానంలోకి ఆడాలనుకున్నా.. అవకాశం దక్కక..పెవిలియన్ నుంచే తమ వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఈ మ్యాచ్ కు అంపైరింగ్ చేస్తోంది.

New Delhi, Mar 22 (ANI): Cricketer-turned-politician Gautam Gambhir met President of Bharatiya Janata Party (BJP) Amit Shah after joining the party on Friday. He was welcomed to the party by Union Finance Minister Arun Jaitley and Union Minister of Law and Justice Ravi Shankar Prasad. During the media interaction, Gambhir thanked BJP for giving him the opportunity.
Last Updated : Mar 23, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.