రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 37 మంది డీఎస్పీ స్థాయి అధికారులను ఒకేసారి బదిలీ చేశారు. ఏడుగురు డీఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చారు. మిగతా 30 మందిని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిపోర్ట్ చేసిన తర్వాత ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు వీరికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు సమాచారం. విజయవాడ, విశాఖ కమిషనరేట్లతోపాటు ఇంటెలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్, డివిజన్ స్థాయిలో పనిచేసే డీఎస్పీలు ఉన్నారు. ఒకేసారి 30 మందిని వీఆర్‌కు పంపటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ