నేటి నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మెుదలు కానున్నాయి. ఈనెల 29 వరకు జరగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 38 వేల 872 మంది విద్యార్థులు హాజరు అవుతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 201 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 15 ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామన్నారు. స్పాట్ వాల్యుయేషన్ జూలై 4, 5 తేదీలలో జరుగుతుందని... విశాఖ, కాకినాడ, గుంటూరు, కడపలో కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి