TDP Agitations Continues Against Chandrababu Arrest In AP : మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో తమ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో బాబుకు (Chandrababu Case in Supreme Court) ఊరట లభించాలంటూ ప్రార్థనలు నిర్వహించారు.
TDP Leaders Rally For Chandrababu : విజయనగరం జిల్లా నెల్లిమర్లలో బాబుతోనే మేమంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. రాజాంలోని టీడీపీ కార్యాలయం వద్ద చెరసాలలో ఉన్నట్లుగా.. రిలే నిరాహార దీక్షను (Relay Hunger Strike for Chandrababu) చేపట్టారు. అనకాపల్లి జిల్లా పూడిమడక సాగర తీరంలో జలదీక్ష చేశారు.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో టీడీపీ, జనసేన నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను చెతన్య పరిచారు. కాకినాడలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. విశాఖలో GVMC కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
TDP Leaders Agitations : కదిలించిన అభిమానం..! చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం
Signature Collection Program in Support of Chandrababu : కర్నూలు జిల్లా కోడుమూరులో పార్టీ శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంతకాలతో కూడిన పుస్తకాలను ప్రదర్శించారు. ఆదోనిలోని 30 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కర్నూలులో వినూత్నంగా న్యాయం కావాలంటూ భిక్షాటన చేశారు.
బాపట్ల జిల్లా పర్చూరులో చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ.. దర్గాలో ముస్లిం సోదరులు, మహిళలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాబు విడుదల కావాలంటూ గట్టిపాటి రవి కూమర్ చేపట్టిన సైకిల్ యాత్ర సంతమాగులూరు నుంచి సజ్జాపురం వరకు సాగింది. పర్చూరు దర్గాలో ముస్లింలు, మహిళలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాబుతోనే మేమంటూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. "సైకో పోవాలి.. సైకిల్ రావాలి" అంటూ నినాదాలు చేశారు.
కడప జిల్లా పెద్ద దర్గాలో పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీకి నిలువెత్తి నిదర్శనమని, ఆయన మీద కేవలం రాజకీయ కక్షతోనే సీఎం జగన్ తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా నాగిరెడ్డిపల్లిలో పోలేరమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో అమరావతి రాజధాని దీక్ష శిబిరం వద్ద తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు ఖండిస్తూ మెడకు ఉరితాడుతో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకులు బాబుతో నేను.. కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికి వెళ్లి ప్రజలను చైత్యం పరిచారు.
TDP Agitation Continues Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు.. నిరసనగా కొనసాగుతున్న దీక్షలు