ETV Bharat / state

Threat: 'నా భర్తకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి'.. ఎస్పీకి పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు

Threat: ‘ఎమ్మెల్సీ సునీతకు అనుకూలంగా పని చేయొద్దు... మా మాట వినకపోతే అంతు చూస్తాను..’ అని తన భర్త గోలి ఆనందరావును ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు, వైకాపా నేత కరణం వెంకటేష్‌ బెదిరించారని పేర్కొంటూ.. పద్మశాలి కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ గోలి కుమారి ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు.

padmashali corporation director complaint kumari to sp vakul jindal over harassing her husband
ఎస్పీకి పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు
author img

By

Published : Jun 12, 2022, 9:03 AM IST

Threat: ‘ఎమ్మెల్సీ సునీతకు అనుకూలంగా పని చేయొద్దు... మా మాట వినకపోతే అంతు చూస్తాను..’ అని తన భర్త గోలి ఆనందరావును ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు, వైకాపా నేత కరణం వెంకటేష్‌ బెదిరించారని పేర్కొంటూ.. పద్మశాలి కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ గోలి కుమారి ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేయగా శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాపట్లలో ఈనెల 5న వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న తన భర్త ఆనందరావును ఎమ్మెల్సీ సునీతకు మద్దతుగా తిరగడం మానుకోవాలని వెంకటేష్‌ బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటేష్‌, ఆయన అనుచరుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని కుమారి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేసి పోలీసుల రక్షణ కల్పించాలని, బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.