Removed the road blocking wall in bodduvaripalem: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో ఉపాధ్యాయురాలు సుధారాణి.. దారి వివాదంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న గోడను పడగొట్టారు. బొడ్డువానిపాలెం గ్రామంలో తలెత్తిన దారి వివాదంలో రాజీ కుదిర్చేందుకు అధికారులు డీఎస్పీ శ్రీకాంత్, డీపీవో విశ్వనాథ్, ఆర్డీవో సరోజినీ దేవి.. రంగంలోకి దిగారు. గ్రామానికి చేరుకున్న అధికారులు.. ఉదయం నుంచి ఇరువురిని గ్రామ సచివాలయం వద్ద కూర్చోబెట్టి రాజీకి ప్రయత్నాలు చేశారు.
అనంతరం దారికి అడ్డుగా ఉన్న గోడను అధికారులు సిబ్బంది చేత కొంతమేర తొలగించారు. ఈ క్రమంలో దారికి సంబంధించిన స్థల యజమానికి సంబంధించిన మహిళలు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉంటే ఎలా పడగొడతారని వాగ్వాదానికి దిగారు. ఫలితంగా కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు అధికారుల సమక్షంలో దారికి సరిపడి మేర గోడను తొలిగించారు.
ఇదీ చదవండి: