Tenant Farmer Suicide: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు పంచాయతీ పరిధిలోని కనగాల వారి పాలెం లో కౌలు రైతు గుండె ఆగింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం కనగలవారిపాలెం గ్రామానికి చెందిన కనగాల శ్రీనివాసరావు 56 రెండెకరాల పొలం కలిగి ఉన్నాడు. కాగా ఈ ఏడాది గ్రామంలో 14 ఎకరాలు మిరప పంట వేశారు. సెనగ పంటలో నష్టం రాగా ప్రస్తుతం మిరప పంట కూడా పూర్తిస్థాయిలో దెబ్బతినింది. దీంతో సాగు కోసం అప్పుతెచ్చాడు. సుమారు 70 లక్షల రూపాయల వరకు చేశాడు. కొద్దిరోజుల క్రితం ఒక ఎకరా పొలం అమ్మి కొంతమేర అప్పులు తీర్చాడు. మిగిలిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇంటి వద్దనే పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి రావినూతల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఇవీ చదవండి: