ETV Bharat / state

బాపట్లలో ఫ్లెక్సీల రగడ.. పరస్పర ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదు - leaders in an engineering college

Flexi fight TDP vs YSRCP: ఇంజనీరింగ్ కళాశాలలో వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. తమ నాయకుడి ఫ్లెక్సీని వైసీపీ నేతలు చించారని ఆరోపిస్తూ టీడీపీ, వైసీపీల నేతలకు చెందిన ఫ్లెక్సీని చించేసిన ఘటనలో ఇరువర్గాల నాయకులు, విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

Flexi fight TDP vs YSRCP
ఫ్లెక్సీల రగడ
author img

By

Published : Dec 22, 2022, 10:27 PM IST

ఫ్లెక్సీలు చించారని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులపై పోలీసులు కేసులు

Flexi fight between students and leaders: బాపట్ల జిల్లాలో ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 9న బాపట్ల పర్యటనకు వచ్చిన సందర్భంగా స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బస చేశారు. టీడీపీ మద్దతుదారులైన కొందరు విద్యార్థులు చంద్రబాబు, ఎన్టీఆర్ ఫ్లెక్సీని కళాశాల సమీపంలోని 216 జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. కొందరు వైసీపీ నాయకులు ఈనెల 20వ తేదీ అర్ధరాత్రి కారు, బైక్​ల్లో వచ్చి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫ్లెక్సీని చించేసి ప్రేము ఎత్తుకుపోయారు. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు బుధవారం ఉదయం వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించి వేశారు.

సీఎం జగన్ జన్మదిన వేడుకలు: తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీ చింపారని బాపట్ల గ్రామీణ పోలీసులకు వైసీపీ నాయకులు విద్యార్ధులపై ఫిర్యాదు చేశారు. వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఇంజనీరింగ్ కళాశాల వద్ద బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ, డిజేలతో హోరెత్తించి కళాశాల గేటును తోసుకుని వైసీపీ శ్రేణులు లోపలికు వెళ్లారు. అతికష్టం మీద పోలీసులు వారిని ఆపగలిగారు. ఆ సమయంలో కళాశాల తరగతులు ముగించుకొని బయటకు వస్తున్న జమ్ములపాలెంకు చెందిన పువ్వాడ గిరీష్ చంద్ర అనే విద్యార్థిని వైసీపీ నాయకులు కాలర్ పట్టుకుని లాకెళ్లారని విద్యార్థి ఆరోపిస్తునారు. అలాగే తన మెడలో వైకాపా జెండా వేసి జై జగన్ అని చెప్పాలని వీడియోతీస్తూ... తనను బలవంత పెట్టారని దీనికి విద్యార్థి నిరాకరించినట్లు ఆ విద్యార్థి తెలిపారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల తెలుగు యువత పార్టీ మారారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారని గిరీష్ చంద్ర ఆరోపిస్తున్నాడు.

టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ఫిర్యాదు: వైసీపీ ఫిర్యాదు మేరకు బాపట్ల గ్రామీణ పోలీసులు వైసీపీ ఫ్లెక్సీలు చించారని మోక్షజ్ఞ, పవన్ అనే ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకొని స్టేషన్లో ఉంచారు.ప్లెక్సీ చించివేసిన కేసులో సంబంధం లేని వారిపైన వైకాపా నాయకులు చెప్పారని పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేసిన వైకాపా నాయకులపై విద్యార్థి గిరీష్ చంద్ర బాపట్ల గ్రామీణ పోలీసులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ఫ్లెక్సీ చించిన ఘటనలో వైసీపీ నేతలపై టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.