RTC Busses to ycp Plenary: వైకాపా ప్లీనరీ సమావేశాలకు ఆర్టీసీ బస్సులు పంపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లీనరీ పేరుతో తమను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని రాష్ట్ర సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైకాపా ప్లీనరీ జరుగుతోంది. బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ డిపోలో మొత్తం 82 బస్సులు ఉండగా.. 71 బస్సులు, బాపట్ల ఆర్టీసీ డిపోలో 45 బస్సులు ఉండగా 35 బస్సులను ప్లీనరీకి జనాన్ని తరలించేందుకు పెట్టారు. దీంతో రోజువారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం గుంటూరు వెళ్లేందుకు ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ఎలా వెళ్లాలో అర్థం కావటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో అడ్డగోలు ఛార్జీలు చెల్లించి వెళ్లాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్లీనరీకి వెళ్తున్న బస్సుకు తప్పిన ప్రమాదం: అద్దంకి మండలం కలవకూరు గ్రామంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రామం నుంచి జనాన్ని ప్లీనరీకి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విద్యుత్ తీగలకు తగిలింది. డ్రైవర్ అలాగే ముందుకు వెళ్లడంతో కరెంట్ తీగలు తెగిపోయి విద్యుత్ స్తంభం కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన విద్యుత్ తీగలను తొలగించి మరమ్మతులు చేపట్టారు.
ఇదీ చదవండి: