- మళ్లీ భయం పుట్టిస్తున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక సూచన
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో వైరస్ జన్యు క్రమ విశ్లేషణకు పాజిటివ్ నమూనాలు పంపించాలని అన్నీ రాష్ట్రాలకు సూచనలు జారీచేసింది.
- చైనాలో నిమ్మకాయలకు భారీ గిరాకీ.. ఎగబడుతున్న ప్రజలు.. ఎందుకో తెలుసా?
కరోనా కేసులతో సతమతమవుతోన్న చైనాలో ప్రజలు నిమ్మకాయల కోసం ఎగబడుతున్నారు. వీటిని కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఇంతకీ చైనీయులకు వాటితో ఏం పని? అక్కడ నిమ్మకాయలకు ఎందుకంత డిమాండ్..?
- బడుగు వర్గాలకు భారీ షాక్.. ఉచితం నుంచి 3 లక్షల 93 వేల కనెక్షన్లు తొలగింపు
ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం విద్యుత్ షాక్ ఇచ్చింది. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నుంచి.. దాదాపు 3 లక్షల 93 వేల కనెక్షన్లు తొలగించింది. జగ్జీవన్ జ్యోతి పథకం నిబంధనల మేరకు అర్హతలున్న వారికీ కోత పెట్టేసింది. ఉచిత విద్యుత్ పథకం నుంచి ప్రభుత్వం తమను ఎందుకు తీసేసిందో తెలియడం లేదని.. కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు.
- రాష్ట్ర రైతులపై ఏటా పెరుగుతున్న రుణభారం..
రాష్ట్ర రైతులపై ఏటా రుణభారం పెరుగుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. లోక్‌సభలో ఓ సభ్యుడు రైతుల అప్పులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా బదులిచ్చింది. తమిళనాడు తర్వాత అత్యధిక వ్యవసాయ రుణ భారం ఆంధ్రప్రదేశ్ రైతుల పైనే ఉందని కేంద్రం ఇచ్చిన లెక్కలతో వెల్లడైంది.
- బాపట్ల డిపో స్థలంపై చేతులెత్తేసిన ఆర్టీసీ .. వైసీపీ కార్యాలయం కోసమేనా..
బాపట్లలో ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ కార్యాలయం కోసం లీజుకిచ్చిన వ్యవహారంపై.. ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసింది. 16 కోట్ల విలువైన స్థలాన్ని అధికార పార్టీకి ధారాదత్తం చేసేందుకు సమ్మతి తెలిపింది. ఆ స్థలం తమదేనని తొలిరోజు ఎండీ గట్టిగానే చెప్పగా.. రెండో రోజే హక్కు లేదంటూ యాజమాన్యం వివరణ ఇచ్చింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదునూ వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన తీవ్రస్థాయి ఒత్తిళ్లతో.. ఆర్టీసీ యాజమాన్యం 24 గంటల్లోనే జీహుజూర్ అంటూ తలూపింది.
- నేడు ఖమ్మంలో టీడీపీ శంఖారావం.. పసుపుమయంగా మారిన నగరం
తెలంగాణలోని ఖమ్మం గుమ్మంలో టీడీపీ శంఖారావం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ బలోపేతంగా లక్ష్యంగా ఇవాళ నిర్వహించే సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. సభను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్న టీడీపీ.. లక్ష మందిని తరలించేలా ప్రణాళికలు చేస్తోంది.
- ఆ ఫుట్‌బాల్ సంబరం భారత్‌కు ఎప్పుడు..? సాకర్ అర్హత సాకారమయ్యేనా?
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా గెలిస్తే పొంగిపోయాం.. మెస్సి కప్పు కల తీరితే సంబరాలు చేసుకున్నాం. మరి.. సాకర్ సమరంలో భారత్ తలపడితే చూసేదెప్పుడు? కప్పు సంగతి పక్కనెడితే కనీసం టోర్నీకి అర్హత సాధించినా సంబరాలు చేసుకునేదెప్పుడు?.. ఇప్పటికైతే ఇవి జవాబు లేని ప్రశ్నలే. సుమారు 4.62 కోట్ల జనాభా ఉన్న అర్జెంటీనా విశ్వ విజేతగా అవతరించింది. దాదాపు 40 లక్షల జనాభా కలిగిన క్రొయేషియా 2018లో రన్నరప్‌గా నిలిచి.. ఈసారి మూడో స్థానం సాధించింది. కానీ 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్.. మాత్రం ప్రపంచకప్ అర్హతకూ చాలా దూరంలో ఉంది.