CPI RAMAKRISHNA FIRE ON AP GOVT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన.. ఆనాటి ఆంగ్లేయుల పరిపాలనను గుర్తు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మరోసారి మండిపడ్టారు. జీఓ నెంబర్.1ని అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని బాపట్లలో పేర్కొన్నారు. భోగి పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా జీఓ నెంబర్.1 ప్రతులను భోగి మంటల్లో దహనం చేస్తామని స్పష్టం చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి విచక్షణ కోల్పోయి ఇలాంటి జీవోలను ఇవ్వటం దారుణం అన్నారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ వాళ్ళు ఈ జీవోని తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు దాన్ని బయటకు తీసి, ప్రశ్నించే వారందరినీ అణిచివేయాలని జగన్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఒకటో నెంబర్ జీవో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయటానికే తప్ప.. మరీ దేనికి పనికిరాదని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటానికే ఈ జీవోని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. జగనన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయటానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి విచక్షణ కోల్పోయి ఇలాంటి జీవోలను ఇవ్వటం దారుణం. అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. భోగి పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా జీఓ నెంబర్.1 ప్రతులను భోగి మంటల్లో దహనం చేస్తాం. - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి