ETV Bharat / state

షిర్డీ సాయిబాబాకు బంగారు కిరీటం.. ఓ భక్తుడి కానుక - gold crown

Shirdi Saibaba.. అనేకమంది భక్తులు తమ కోరికలు నెరవేరడంతో షిర్డీ సాయిబాబాకు తమ వంతు బంగారు ఆభరణాలు విరాళంగా అందజేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు తన ఎన్నో ఏళ్ల కల నెరివేరినందుకు సాయినాథుడికి బంగారు కిరీటాన్ని అందజేశారు. ఇందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

1
1
author img

By

Published : Aug 11, 2022, 10:19 PM IST

Gold crown to Saibaba.. ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ భక్తుడు షిర్డీలోని సాయిబాబాకు రూ.36 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. బాపట్లకు చెందిన సాయి భక్తుడు అన్నం సతీష్ ప్రభాకర్ 770 గ్రాముల బంగారు కిరీటాన్ని సాయినాథుడికి విరాళంగా అందించారు. అలాగే సాయిబాబా సంస్థానానికి 33 వేల 480 రూపాయల విలువైన 620 గ్రాముల వెండి పళ్లెం విరాళంగా అందజేశారు. . ఈ విరాళాన్ని రక్షా బంధన్ రోజున సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్‌కు అందజేశారు. సాయినాథుడికి బంగారు కిరీటాన్ని అందించడంతో తన ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని సతీష్​ ప్రభాకర్​ తెలిపారు.

గత నెలలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య చివరి కోరిక మేరకు రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని సాయి సంస్థానానికి అందించాడు. ఆగస్టు 7న ఢిల్లీకి చెందిన సాయి భక్తుడు రిషబ్ లోహియా సాయిబాబాకు బంగారు వేణువును సమర్పించారు. అనేకమంది భక్తులు తమ కోరికలు నెరవేరడంతో సాయిబాబాకు తమ వంతు బంగారు ఆభరణాలు విరాళంగా అందజేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.