TRS BJP Clash at Marriguda polling station: మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. తెరాస శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ.. మర్రిగూడలో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. గజ్వేల్ తెరాస నాయకులు ఇక్కడ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిద్దిపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు భాజపా కార్యకర్తలు అప్పగించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.
పోలింగ్ నిలిపేయాలంటూ పోలీసులతో భాజపా నాయకులు వాగ్వాదానికి దిగారు. వీడియోలు తీస్తున్నామనే నెపంతో భాజపా శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. భాజపా శ్రేణుల అరెస్ట్‌ను నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షల నగదు పట్టుబడింది.
నగదు తరలిస్తున్న కారును భాజపా శ్రేణులు పట్టుకున్నాయి. చండూరులోనూ రూ.2లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మర్రిగూడలో 42 స్థానికేతరులను గుర్తించి బయటకు పంపారని సీఈవో తెలిపారు. ఓటు కోసం డబ్బు ఇవ్వడం, తీసుకోవడం తప్పు అని ఆయన పేర్కొన్నారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలి
మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. పోలీసులు వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు. స్థానికేతరులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపారు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం తప్పు. ఓటుకు డబ్బు ప్రస్తావన రావడం దురదృష్టకరం.ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలి. - వినయ్ కృష్ణారెడ్డి, సీఈవో
ఇవీ చదవండి: