Propose day : Propose day : ఫిబ్రవరి నెల ప్రేమికులకు ప్రత్యేకమైంది. ఈ నెలంతా వారికి ప్రేమమయమే. ముఖ్యంగా ఈ నెలలోని రెండో వారం చాలా స్పెషల్. 7వ తేదీ నుంచి మొదలుకుని 14 వరకు ప్రేమికులు వారోత్సవాలు జరుపుకుంటారు. ఒక్కో రోజును ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రోజును రోజ్ డే, రెండో రోజు ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వాంటైన్స్ డే. ఇలా ఏడు రోజులు లవర్స్ పీకలోతుల్లో ప్రేమలో మునిగిపోతారు. లవ్ వీక్‌లో ఇవాళ చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజు ప్రపోజ్ డే. ప్రేమించడం ఎవరైనా చేస్తారు.. కానీ దాన్ని వ్యక్తపరిచే ధైర్యం మాత్రం కొందరిలోనే ఉంటుంది. గుండెల నిండా దాచుకున్న ప్రేమని.. ప్రియుల కళ్లల్లోకి చూస్తూ చెప్పడం సాధారణమైన విషయం కాదు. ఏదేమైనా ప్రేమించిన వాళ్లకి దాన్ని తెలియజెప్పటానికి ఇదే సరైన సమయం.
చాలా మంది అనేక రకాలుగా ప్రపోజ్ చేస్తారు. మన ప్రేమను ఓకే చెయ్యాలంటే వాళ్లు ఫిదా అయ్యేలా ప్రపోజ్ చెయ్యాలి. వాళ్లకు నచ్చేలా.. మనల్ని మెచ్చేలా ప్రేమను తెలియజెప్పాలి. దీనికోసం అందరిలా కాకుండా.. రొటీన్‌కు భిన్నంగా భావాన్ని వ్యక్తపరచాలి. కొన్ని విషయాలు పాటిస్తూ ఈ విధంగా ప్రపోజ్ చేయటం వల్ల మీ ప్రేమను అంగీకరించే అవకాశం ఉంటుంది. వాటిల్లో కొన్ని...
1. Propose Differently : చాలా మంది ప్రపోజ్ అనగానే డైరెక్ట్‌గా ఐ లవ్ యూ ( I Love You) అని చెప్పేస్తారు. కొందరు దీనికి అంగీకరించినా.. మరికొందరికి అంతగా నచ్చకపోవచ్చు. అందుకే ఐ లవ్ యూ అని కాకుండా పెళ్లి ప్రస్తావన వచ్చేలా ప్రపోజ్ చేయండి. అంటే " మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా " అని చెప్పేయండి. చాలా ప్రేమలు ఈ కాలంలో మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇలా నేరుగా పెళ్లి గురించి చెప్పడం వల్ల వాళ్లకు ఒక నమ్మకం ఏర్పడుతుంది.
2. Explain the Perticular Reason : మీరెందుకు వాళ్లని ఇష్టపడ్డారో కారణాన్ని తెలుపుతూ ప్రేమను వ్యక్తపరచండి. వారి గుణగణాలు చెప్తూ ప్రపోజ్ చేయండి. అంటే చాలా మంది అందానికి, ఆకర్షణకు పడిపోతారు. మీరు అలా కాదని చెబుతూ.. మీరు వారిలో ఏం చూసి ప్రేమించారు? ఏ క్వాలిటీ ( Most Liked Quality) నచ్చింది? వాళ్లకు ఓకే అయితే ఇంట్లో వాళ్లని ఎలా ఒప్పిస్తారు? పెళ్లి అయ్యాక వాళ్లను ఎంత బాగా చూసుకుంటారు? ఫ్యూచర్ ప్లాన్స్ ( Future Plans After Marriage ) ఏంటో వివరిస్తూ.. ముందుగానే మీ ప్రేమను భిన్నంగా తెలపండి.
3. Prospose With What You Have : చాలా మంది విలువైన బహుమతులు ఇచ్చి ప్రపోజ్ చెయ్యాలని అనుకుంటారు. కొందరు అలాంటివి ఆశిస్తారు కూడా. కానీ ప్రేమను చెప్పాలనుకున్న వాళ్లు గొప్పలకు పోకుండా మీకు ఉన్నదాంట్లోనే ఇచ్చి.. ప్రేమను చెప్పండి. ఒక గులాబీ పువ్వు, చిన్న చాక్లెట్, ఇచ్చి చెప్పినా సరిపోతుంది. వీటితో పాటు మీలోని భావాలు ఒక చిన్న లెటర్‌పై రాసి ఇచ్చినా పర్లేదు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్లు మీరు ఎలా చెప్పినా ఓకే చేస్తారని మర్చిపోకండి. వాళ్లకు కావల్సింది విలువైన బహుమానాలు కాదు.. ఆ విషయం మీరు తెలుసుకోండి.
4. Plan For Dinner: మీ ప్రేమను చెప్పడానికి సరైన ప్రాంతమూ ముఖ్యమే. వాళ్లను ఎక్కడికి రమ్మంటే బావుంటుంది? ఏ ప్లేస్ అయితే సౌకర్యవంతంగా ఉంటుంది అని ఆలోచిస్తారు. అన్నింటిలో కెల్లా.. డిన్నర్‌కి పిలిస్తే బెటర్. ఏదైనా మంచి వాతావరణం ఉన్న రెస్టారెంట్‌కి తీసుకెళ్లి మనసులోని మాటను చెబితే విన్న తనకీ చాలా ఫీల్ కలుగుతుంది. లేదా మీరు మొదటిసారి మీరిద్దరూ కలుసుకున్న ప్లేస్ (First Met Place) అయినా పర్లేదు. పైగా సెంటిమెంటులు ఎక్కువ ఉన్నవాళ్లకు ఇలాంటివి బాగా కలిసి వస్తాయి.
5. Tell them Directly : తమలోని ప్రేమను చెప్పేందుకు కొందరు భయపడతారు. దీనికోసం వాళ్లు రకరకాల ఉపాయాలు ఆలోచిస్తారు. మెసేజ్ చెయ్యడం, కాల్ చేసి చెప్పడం, ఉత్తరం, ప్రేమ లేఖ రాయటం వంటివి చేస్తారు. కానీ వీటన్నిటి కంటే వాళ్లని కలిసి నేరుగా చెప్పడమే ఉత్తమం. ఎందుకంటే.. మెసేజ్, కాల్స్‌లో వాళ్ల ఫీలింగ్స్ అర్థం కావు. అదే ఫేస్ టూ ఫేస్ అయితే వాళ్లు ఏం అనుకుంటున్నారో ఎలా ఫీల్ అవుతున్నారో వారి మొహంలోనే కనబడుతుంది.
6. Do not feel Stress: ప్రేమను వ్యక్త పరచడానికి చాలా మంది ఒత్తిడిగా ఫీల్ అవుతారు. కాస్త మీపై మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కాసేపు దాన్ని పక్కకు పెట్టండి. అవి పోవడానికి ప్రపోజ్ చేసే ముందు ప్రశాంతత కోసం జోక్స్ చూడండి. అవసరం అయితే ఒకసారి ప్రాక్టీస్ చెయ్యండి. దీనితోపాటు మీరు వేసుకునే డ్రెస్సింగ్ ముఖ్యం. అనవసరపు ఆర్భాటాలకు పోకుండా చాలా సింపుల్‌గా ఉండే దుస్తులు ధరించండి. సింపుల్ డ్రెస్‌తో నీవు ప్రపోజ్ చేసే తను/ఆమె దగ్గర 100శాతం మార్కులు కొట్టేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రపోజ్ చేసేయ్ గురూ..!
ఇవీ చదవండి: