ETV Bharat / state

New groom died: పెళ్లైన రెండోరోజే వరుడు మృతి... అసలేం జరిగింది? - అన్నమయ్య జిల్లా తాజా వార్తలు

New groom died: వారిద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు.. పెద్దలు ఒప్పుకోలేదేమో ఆలయంలో ప్రేమ బంధాన్ని.. భార్యాభర్తల బంధంగా మార్చుకున్నారు. నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కలలు కన్నారు. కానీ ఆ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. మృత్యువు వారి జీవితాల్లో అనుకోని విషాదాన్ని నింపింది. అసలేం జరిగిందంటే..?

New groom died
New groom died
author img

By

Published : Sep 14, 2022, 12:24 PM IST

Updated : Sep 14, 2022, 4:24 PM IST

New groom died: ఆటపాటలు, కుర్రకారు డాన్సులతో సందడిగా సాగిన ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో ఆశలు, మరెన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న వారి కలలను మృత్యువు చిదిమేసింది. పెళ్లి జరిగి ఒక్కరోజన్న గడవకముందే వరుడు కన్నుమూయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా పాకాల మండలం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన తులసిప్రసాద్‌కు.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని చంద్రకాలనీకి చెందిన శిరీష అనే యువతితో (సెప్టెంబర్​ 12) సోమవారం ఉదయం వివాహం జరిగింది. మంగళవారం రాత్రి పెళ్లి కూతురు ఇంటి దగ్గర కార్యానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఉన్నట్టుండి పడక గదిలో వరుడు అచేతనంగా పడిపోవడంతో ఆందోళనకు గురైన వధువు.. కుటుంబ సభ్యులకు తెలిపింది. అప్రమత్తమైన వారు వెంటనే వరుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తులసిప్రసాద్‌ మృతి చెందినట్టు సమాచారం. దీంతో మదనపల్లె నుంచి వరుడు మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించారు. పెళ్లి జరిగి.. పచ్చని పందిళ్లు, తోరణాలు వాడిపోకముందే వరుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 14, 2022, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.