MLA Rajasingh demanded PD Act on OU student: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత్ నాస్తిక్ సమాజ ప్రతినిధి, ఓయూ విద్యార్థి బైరి నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేపట్టారు. బైరి నరేశ్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. నిర్మల్ జిల్లాలో అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బైరి నరేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోనూ అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు.
మరోవైపు హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై అయ్యప్ప భక్తులు ధర్నా చేపట్టారు. చేవెళ్ల, మొయినాబాద్‌లో రోడ్డుపై నిరసన చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఓ మతంపై మాట్లాడితే తనపై కేసు నమోదు చేశారని, అలాగే నరేశ్‌పైనా కూడా పీడీ యాక్ట్ పెట్టాలన్నారు.
ఇవీ చదవండి: