కోర్టు ధిక్కరణ కేసులో కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్‌గార్గ్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ చీఫ్ ప్రాజెక్ట్ అధికారి ఎం.సుదర్శన్‌రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వారిద్దరికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. అప్పీల్‌కు వెళ్లేందుకు వెసులుబాటు ఇస్తూ తీర్పు అమలును వారం నిలిపివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి గురువారం ఈ తీర్పు ఇచ్చారు.
మైనింగ్ అవసరాల నిమిత్తం కడప జిల్లా మంగంపేట ప్రాంతంలోని కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. కట్టడాల కొలతలు లేవన్న కారణంతో బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో ఓబులవారిపల్లె గ్రామానికి చెందిన నరసమ్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. నిర్మాణాల విలువ తేల్చేందుకు ఇంజినీర్లనునియమించాలని స్పష్టంచేసింది. ఆ ఆదేశాలను అధికారులు పాటించకపోవడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది.
ఇదీ చదవండి: ప్రియుడితో బైక్‌పై వెళ్తుందని.. మినీ ట్రక్కుతో ఢీకొట్టిన సోదరుడు