CM JAGAN RELEASE JAGANANNA VIDYA DEEVENA FUNDS : పిల్లల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యాదీవెన పథకం నిధులను ఆయన విడుదల చేశారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని వ్యాఖ్యానించారు. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకే జమ చేసినట్లు చెప్పారు. విద్యాదీవెన, వసతిదీవెనకు ఇప్పటివరకు రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు.
"పేదరికం చదువులకు ఆటంకం కారాదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. నా పాదయాత్రలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నాం. విద్యాదీవెనతో పాటు వసతి దీవెన తీసుకొచ్చాం. విద్యాదీవెన, వసతిదీవెనకు రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టాం. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. పిల్లల చదువులకు పెట్టేది ఖర్చుకాదు.. వారికిచ్చే ఆస్తిగా భావిస్తా"-సీఎం జగన్
తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయని పేర్కొన్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నామన్న సీఎం.. విద్యాదీవెనతో పాటు వసతి దీవెన తీసుకొచ్చామన్నారు. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చామని.. పిల్లల చదువులకు పెట్టేది ఖర్చుకాదు.. వారికిచ్చే ఆస్తిగా భావిస్తామన్నారు. ఎంతమంది పిల్లలున్నా చదువుకయ్యే ఖర్చు తను భరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడుతున్నట్లు తెలిపారు.
CM FIRES ON CHANDRABABU : అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ..సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తేల్చి చెప్పారు.
ఇవీ చదవండి: