ఇదీ చూడండి:
అటు వైకాపా ర్యాలీ.. ఇటు తెదేపా నిరాహార దీక్ష.. ఎందుకంటే..! - tdp protest for amaravthi capital
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... అనంతపురం జిల్లా హిందూపురంలో అఖిలపక్ష నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి పోటీగా వైకాపా నాయకులు అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ దీక్షా శిబిరం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఇరువర్గాలు ఆందోళన చేయటంతో ఉద్రిక్త వాాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ వైకాపా నాయకులకు సద్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడం వల్ల వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ర్యాలీ చేస్తున్న వైకాపా నాయకులు... నిరాహార దీక్షచేస్తున్న తెదేపా శ్రేణులు
sample description