ETV Bharat / state

YSRCP Scam: పండ్ల తోటల పేరిట 'ఉపాధి' నిధుల స్వాహా.. రాప్తాడులో వెలుగు చూసిన నయా మోసం - scam in National Rural Employment Guarantee Act

YSRCP Leaders Scam in NREGA Orchards: కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుంది రాష్ట్రంలో వైఎస్సార్​సీపీ నాయకుల తీరు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల తోటల పెంపకం పథకాన్ని తమకు అనుకూలంగా మలచుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. పండ్ల తోటలు సాగు చేస్తున్నట్లు బోర్డులు పెట్టి ఫొటోలు దిగి.. బ్యాంకు ఖాతాలో నగదు జమ కాగానే అక్రమార్కులంతా వాటాలు వేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో పండ్ల పెంపకం సాగుతో వైఎస్సార్​సీపీ నేతలు, ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు కలిసి నయా మోసానికి పాల్పడిన వైనంపై ఈటీవీ-ఈటీవీ భారత్​ కథనం.

YCP Leaders Scam in NREGA Orchards
YCP Leaders Scam in NREGA Orchards
author img

By

Published : Jun 27, 2023, 12:21 PM IST

YCP Leaders Scam in NREGA Orchards: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలకు.. సొంత గ్రామాల్లోనే పనులు కల్పించాలనే సదుద్దేశంతో కేంద్రం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సొంత భూమి ఉన్న రైతులకు పండ్ల తోటలు పెంచుకునేందుకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. పండ్ల తోటల పెంపకానికి ముందుకొచ్చే చిన్న, సన్నకారు రైతులకు.. భూమిలో గుంతలు తవ్వటం నుంచి మొక్క నాటి, నీరు పోసి పెంచే వరకు ప్రభుత్వమే నిధులు అందిస్తుంది. ఎంపిక చేసిన మొక్కలు సైతం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా ఇస్తుంది. ఇందులో భాగంగా రైతులు మామిడి, బత్తాయి, జామ పంటలు సాగుచేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకమే వైఎస్సార్​సీపీ నాయకుల పాలిట కొంగు బంగారంలా మారింది.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం కొత్తపల్లిలోని ఓ వైసీపీ నాయకుడు సర్వే నెంబరు 101-1Bలోని 4.9 ఎకరాల్లో జామ సాగు చేయడానికి దరఖాస్తు చేసుకోగా ఉపాధి హామీ పథకం నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని అంచనాలు రూపొందించారు. ఇప్పటివరకు పొలంలో గుంతలు తీయడానికి, మొక్కల కొనుగోలు, నీళ్లు పట్టడానికి 77 వేలు మంజూరు చేశారు. అయితే సదరు సర్వే నెంబరులో జామ తోట సాగు చేయడం లేదు. అక్కడ బీర తోట సాగులో ఉంది. కొత్తపల్లికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తన బంధువుల పేరిట పండ్ల తోటలు మంజూరు చేసుకుని నిధులు కాజేశారు.

ఓ మహిళ పేరుతో సర్వే నెంబర్లు 43, 143, 144లో.. 10 లక్షల అంచనాతో జామతోట మంజూరు చేయించుకున్నారు. ఇప్పటివరకు 70 వేలు డ్రా చేసుకున్నారు. మరికొన్ని సర్వే నెంబర్లలోనూ తోటలు కనిపించడం లేదు. పండ్ల తోటలు సాగు చేసినట్లు రికార్డుల్లో చూపి భారీగా ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారు. వైసీపీ నాయకులు, కొందరు అధికారులు కలిసి లక్షల్లో అవినీతికి పాల్పడ్డారు. కొత్తపల్లి, గొందిరెడ్డిపల్లి, గాండ్లపర్తి, బండమీదపల్లి, రాప్తాడు పంచాయతీల పరిధిలో జామ, మామిడి, చీనీ తోటలు సాగు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. వీటికి వేలల్లో బిల్లులు కూడా మంజూరు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. 80 శాతం సర్వే నెంబర్లలో అసలు తోటలే సాగు చేయలేదు. ఇదే రీతిన గత మూడు సంవత్సరాల నుంచి కోట్లల్లో అవినీతికి పాల‌్పడినట్లు తెలుస్తోంది.

ఈ మొత్తం బాగోతంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఓ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో కలిసి వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉపాధి హామీలో పండ్లతోటల పెంపకానికి సంబంధించి టెక్నికల్‌ అసిస్టెంట్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. పొలం కొలతలు, చెట్లు పెట్టారా లేదా అనేది తనిఖీ చేసి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వైసీపీ నాయకులతో కుమ్మక్కై పొలాల్లో పండ్ల మొక్కలు లేకపోయినా ఉన్నట్లు రికార్డులో నమోదు చేశారు.

బిల్లులు వచ్చిన తర్వాత అందులో సగం ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు గొందిరెడ్డిపల్లిలోఓ సర్వే నంబర్‌లోని భూమిలో తోట జాడ లేకపోగా.. మట్టిని సైతం యథేచ్ఛగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. తోటల పెంపకానికి ఎలాంటి పనులు జరగపోయినా వర్క్‌ ఐడీలు సృష్టించి.. బిల్లులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ రైతుకు సంబంధించిన బిల్లును మరో రైతు ఖాతాలో జమచేయడంతో ఈ నయా అవినీతి వెలుగులోకి వచ్చింది.

రోజూవారీ ఉపాధి పనుల్లో సైతం సదరు టెక్నికల్‌ అసిస్టెంట్‌ చేతివాటం చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో ఉపాధి కూలీలు ఒక్కొక్కరి నుంచి వారానికి 200 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పని చేయకపోయినా చేసినట్లు మస్టర్లలో సంతకాలు చేయించుకుంటున్నారు. వారానికి ఒక్కో గ్రామం నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్లు 18 వేలు వసూలు చేస్తున్నారు. తర్వాత వాటాలుగా టెక్నికల్‌ అసిస్టెంట్‌కు పంచుతున్నారు. ఇలా ఒక వారానికి అన్ని గ్రామాల నుంచి కలిపి లక్షల్లోనే టెక్నికల్‌ అసిస్టెంట్‌కు ముడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూాడా వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.