ఇంట్లోవారు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఆవేదనకు గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కోటగుడ్డం గ్రామానికి చెందిన మౌనిక అనే యువతి తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు మౌనికను ఆసుపత్రికి తరలించే సమయానికి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. పెళ్లిపీటలెక్కాల్సిన తన కుమార్తె మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి: