అనంతపురం జిల్లాలో పరువు హత్య ఘటనపై యువకుడి బంధువులు ఆందోళన చేశారు. యువకుడి మృతదేహంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నగరం శివారు ప్రాంతంలో చంద్రబాబు కొట్టాల కాలనీలో యువకుడి హత్య ఆందోళన రేకెత్తించింది. సూర్యప్రకాష్ అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం.. వారి బంధువుల ఇళ్లలో తెలిసి చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. యువతి తరపు బంధువులు.. రాత్రి సమయంలో యువకుడు సూర్య ప్రకాష్ ని పిలిచి దాడికి పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు మృతి చెందాడు.
మృతదేహంతో బంధువులు ప్రజా సంఘాలు.. కాలనీలో ఆందోళన చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అయినప్పటికీ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో డీఎస్పీ వీర రాఘవ రెడ్డి, ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. చట్టపరమైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి… జగన్ అక్రమాస్తుల కేసు: రఘురామ పిటిషన్పై 27న నిర్ణయం