అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట గ్రామంలో చంద్రప్ప అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి 12 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లికి 10 సంవత్సరాల నుంచి మతిస్థిమితం సరిగాలేదు. దీంతో మద్యానికి బానిసై జులాయిగా తిరిగేవాడు. చెడు అలవాట్లతో తిరుగుతూ.. ఐదు రోజులుగా ఇంటికి రాలేదు. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో శనివారం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. మృతుడి అన్న రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: