అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లికి చెందిన యువతి అత్యాచారం కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణంరెడ్డిపల్లికి చెందిన ఓ యువతి, నరేశ్ అనే యువకుడు కొట్టాలపల్లి క్రాస్ వద్ద కూర్చుని ఉండగా... రాజశేఖర్ అనే వ్యక్తి తాను పోలీసునని చెప్పి..ఇక్కడేం చేస్తున్నారంటూ వారిని భయపెట్టాడు. అనంతరం అమెను ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి అనంతపురంలోని కొవ్వూర్నగర్లో ఉన్న తన రూంకు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. అనంతరం తన స్నేహితుడైన ఎ.ఆర్ కానిస్టేబుల్ సురేంద్రకు విషయం చెప్పాడు.
సురేంద్ర కూడా ఆమెపై బలత్కారం చేశాడు. వారి వద్ద నుంచి తప్పించుకున్న యువతి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజశేఖర్, సురేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అ యువతి వెంట ఉన్న నరేష్ కూడా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెపై రెండు రోజులుగా బలత్కారం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు.