ETV Bharat / state

వేల్పుమడుగులో అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య - వేల్పుమడుగులో ఆత్మహత్య వార్తలు

అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా మండలం అప్పుల వేల్పుమడుగులో జరిగింది.

young farmer suicide  at velpumadugu
వేల్పుమడుగులో అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
author img

By

Published : Sep 6, 2020, 1:22 PM IST

అనంతపురం జిల్లా మండలం వేల్పుమడుగులో అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన యువరైతు చంద్రశేఖర్ రెడ్డి (24)కి 3 ఎకరాల పొలం ఉంది. దానితో పాటు ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో మరో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేపట్టారు. ఈ క్రమంలో అప్పులు పెరగడం, పంటలు సక్రమంగా లేకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. బాధితుడుని ఓ ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు.

ఇదీ చూడండి. కరోనా వచ్చాక సాయిరెడ్డి మైండ్ పూర్తిగా పాడైంది: అయ్యన్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.