అనంతపురం జిల్లా వ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. అనంతపురం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో యోగాసనాలు నిర్వహించారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. మనిషి జీవితంలో ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ యోగాను అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
పెనుగొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు మైదానంలో యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ తహసీల్దార్ వెంకటరమణ పాల్గొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లులో అంతర్జాతీయ యోగా దినోత్సవం రైల్వే మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు, బాలబాలికలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. దాదాపు 600 మంది యోగాసనాలు వేశారు.
అంతర్జాతీయ యోగా వేడుకలు ఉరవకొండలోని ప్రభుత్వ క్రీడా మైదానంలో ఉత్సాహ బరిత వాతావరణంలో జరిగాయి. వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు యోగాసనాలు వేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యసాయి ఇండోర్ స్టేడియంలో యోగా విన్యాసాలు నిర్వహించారు. మానసిక ఆందోళన తగ్గించేందుకు యోగా అద్భుతమైన ఔషధమని నిపుణులన్నారు.
ఇదీ చదవండి... "ఉన్నస్థితి నుంచి... ఉన్నత స్థితికి పాఠశాలలు"