అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామిని కలిశారు. శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీల నివేదికలను మాజీ మంత్రి నారాయణ అణిచి వేశారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక రాజధానిని నిర్మించిందని తెలిపారు. ఈ రకంగా రాజధాని నిర్మాణం చేపడితే ఎక్కువ సమయం పడుతుందన్నారు. రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసే డబ్బంతా సంక్షేమ పథకాలకు వెచ్చిస్తే ప్రజలు ఆనందంగా ఉంటారని తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: