అనంతపురం జిల్లా యల్లనూరు మండలం వెంకటాంపల్లి గ్రామంలో గతంలో సచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇటీవల అదే పంచాయితీలోని గడ్డంవారిపల్లి గ్రామస్థులు వెంకటాంపల్లిలో కాకుండా తమ గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయాలని అధికారులకు వినతిపత్రం అందించారు.
ఈ క్రమంలో వెంకటాంపల్లి గ్రామంలో సీసీ రహదారుల ఏర్పాటుకు విద్యా సంస్కరణల కమిటీ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి హాజరయ్యారు. వెంకటాంపల్లి గ్రామస్థులు ఆయన వద్దకు వెళ్లి రహదారులు లేకపోయినా పర్వాలేదు.. మా గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేయాలని అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ప్రజలకు అందుబాటులో ఉండేలా సచివాలయం ఎక్కడ ఏర్పాటు చేసేది అధికారులు నిర్ణయిస్తారని సర్దిచెప్పి సీసీ రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేసి వెళ్లిపోయారు. అనంతరం వెంకటాంపల్లి వైకాపా కార్యకర్తలు కోపంతో సీసీ రహదారుల శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు
ఇదీ చూడండి పరామర్శించడానికి వెళితే అనుమతి ఇవ్వలేదు: చంద్రబాబు