ETV Bharat / state

సౌరవిద్యుత్ ప్రాజెక్టులో వైకాపా నేతల హంగామా - ananthapur

నంబుల పూలకుంట మండలంలోని సౌర విద్యుత్ ప్రాజెక్టులోకి ప్రవేశించిన పనులు అడ్డుకున్నారు వైకాపా శ్రేణులు. తమ ఎమ్మెల్యేను సంప్రదించాకే పనులు ప్రారంభించాలని హుకుం జారీ చేశారు. పరిహారాన్ని సాకుగా చూపుతూ అక్కడి అధికారులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. డీఎస్పీ జోక్యంతో వెనుదిరిగారు.

సౌరవిద్యుత్ ప్రాజెక్టులో వైకాపా నేతల హంగామా
author img

By

Published : Jun 2, 2019, 3:24 PM IST

సౌరవిద్యుత్ ప్రాజెక్టులో వైకాపా నేతల హంగామా

అనంతపురం జిల్లాలో వైకాపా నేతలు హంగామా చేశారు. జిల్లాలోని నంబుల పూలకుంట మండలంలోని సౌర విద్యుత్ ప్రాజెక్టులో హల్ చల్ చేశారు. ఎన్టీపీసీ సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు భూమిని లీజుకు ఇచ్చింది. ఈ భూముల్లో ప్రైవేటు సంస్థలు సౌర విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభించాయి. ఇప్పటికే 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మరో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు ఏర్పాటు కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూమిని సేకరించింది. అర్హులైన రైతులందరికీ పరిహారం చెల్లించింది. చిన్నపాటి సమస్యలున్న కొందరు రైతులకు పరిహారం జమ కాలేదు.

దీనిని సాకుగా చూపుతూ వందల సంఖ్యలో వైకాపా కార్యకర్తలు విద్యుత్ ప్రాజెక్టులోకి ప్రవేశించారు. అధికారులు, సిబ్బందితో దురుసుగా వ్యవహరిస్తూ దాడికి యత్నించారు. పోలీసులు వారిస్తున్నా ఖాతరు చేయకుండా హంగామా సృష్టించారు. తమ పార్టీ శాసనసభ్యుడిని సంప్రదించాకే పనులు ప్రారంభించాలన్నారు. ప్రాజెక్టు అధికారుల ద్వారా సమాచారం అందుకున్న కదిరి డీఎస్పీ శ్రీనివాసులు... తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. పరిహారం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వైకాపా శ్రేణులకు హామీ ఇచ్చారు. పనులు ఆపేంతవరకు ఎవరి మాట వినేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్లు, సిబ్బందిని బయటకు పంపించివేశారు. అంతా వెళ్లిపోయాక వైకాపా శ్రేణులు వెనుదిరిగాయి.

Intro:పాణ్యం గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు రు

Body:కర్నూలు జిల్లా పాణ్యం లో గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్సై జగదీశ్వర్రెడ్డి గ్రంథాలయ శాఖ అధికారిని భాగ్యలక్ష్మి , మండల విద్యాధికారి కోటయ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు వేసవికాలంలో చిన్నారుల ఏదో ఒక శిక్షణ ద్వారా ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు

Conclusion:నవీన్ కుమార్ ఈ టీవీ రిపోర్టర్ పాణ్యం కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.