అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రపంచ పత్రికా దినోత్సవ వేడుకలను పాత్రికేయులు, పోలీసులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పోలీస్ శాఖ తరపున సీఐ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో మూలస్తంభంగా ఉన్న జర్నలిస్టులు.. నిజం, నిష్పాక్షికత, కచ్చితత్వం, జవాబుదారీతనం, న్యాయబద్ధత, నైతికత, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి మూల సూత్రాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. మారుతున్న ఆధునిక సాంకేతిక యుగంలో పత్రికాస్వేచ్ఛను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఇదీచదవండి.